నిజాంసాగర్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు రిజర్వాయర్ 1,2,3,4,6,7,8,9,10, వరద గేట్ల ద్వారా గురువారం మధ్యాహ్నం 1 గంటలకు నీటిని విడుదల చేశారు. గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్ రావు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి 64 వేల క్యూసెక్కుల నీటిని దిగువ మంజీర ద్వారా గోదావరిలోకి విడుదల చేశారు. గేట్లను ఎత్తివేయడానికి ముందు గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్ రావుతో పాటు ...
Read More »Daily Archives: October 15, 2020
ఊరూరా బతుకమ్మ సంబరాలు
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా స్థాయి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గురువారం ప్రారంభించారు. స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లాస్థాయి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, సభాధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ దసరా పండుగ, బతుకమ్మ ...
Read More »7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలం పంట నుండి సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్‌గా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరములో 2020-21 సంవత్సరం వానకాల పంట వరి ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లైస్, వ్యవసాయ, సహకార, మెప్మా, రైస్ మిల్లర్స్, ట్రేడర్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు లాభం చేకూరే విధంగా గ్రేడ్ ...
Read More »అందరికి ఆదర్శం కలాం జీవితం
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శనీయమని విశ్వతేజస్ అధ్యక్షుడు తక్కూరి హన్మాండ్లు అన్నారు. భారత దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు కలాం అని ఆయన పేర్కొన్నారు. విశ్వతేజస్, వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ సంస్థల ఆద్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ 89వ జయంతిని నిజామాబాదు నగరం ఖలీల్ వాడిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వతేజస్ సంస్థ అధ్యక్షుడు తక్కురి హన్మాండ్లు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో ...
Read More »అక్టోబర్ 22 వరకు గడువు
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, లేదా పిజి ఆయా కోర్సులలో చేరడానికి అక్టోబర్ 22 వరకు గడువు పొడిగించినట్టు రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు, లేదా యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులన్నారు. అలాగే ఇప్పటికే అడ్మిషన్ పొందిన వారు డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరపు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి కూడా అక్టోబర్ 22 వరకు ...
Read More »బీమా కల్పించి ఉంటే అండగా ఉండేది…
కామారెడ్డి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కామారెడ్డి పట్టణ బందం ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా పాడయిన పంటలను చూసి రైతులతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల రైతులకు చేతికందిన పంట నాశనం అయ్యి తీవ్ర నష్టం వాటిల్లిందని పెట్టిన పెట్టుబడి నిండా మునిగే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ...
Read More »అయ్యా! పాలకులారా వారి గోసచూడండి…
బోధన్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత వారం రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల మూలంగా రైతులు హర్వెస్టింగ్ చేసి, ఆరబెట్టిన ధాన్యమంత తడిసి ముద్దయిందని, హర్వెస్టింగ్ చేయని పంట సేలలో పడిపోయి మొలకలు వచ్చి రైతుల బతుకు ఆగమైందని, ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో రైతులు తడిసిపోయి ఆరబెడుతున్న వరి ధాన్యాన్ని, పంట పొలాలను పరిశీలించిన సీపీఐ (ఎం- ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ, ఏఐకేఏంఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 14 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 5 లక్షల 63 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 472 మందికి 2 కోట్ల 98 లక్షల 70 వేల 300 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు.
Read More »అత్యవసర సమయంలో యువకుల రక్తదానం
కామారెడ్డి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో లక్ష్మీ అనే యువతి రక్త లేమితో చికిత్స పొందుతూ అత్యవసర సమయంలో ఓ – నెగిటివ్ రక్తం అవసరముందని కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్ గ్రూప్ నిర్వాహకులు బొనగిరి శివ, ఆంజనేయులును సంప్రదించారు. వారు రక్తదాతలు మధుసుధన్ రెడ్డి, రమేష్‌ల సహకారంతో ఫోన్లో సంప్రదించారు. సేవ దక్పథంతో స్వచ్చందంగా ముందుకు వచ్చి అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. రక్తదానానికి ముందుకు వచ్చిన వారికి కామారెడ్డి ...
Read More »కామారెడ్డిలో ఏబివిపి కార్యకర్తల అరెస్టు
కామారెడ్డి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని కామరెడ్డికి చెందిన ఏబివిపి కార్యకర్తలు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కామారెడ్డి ప్రభుత్వ విప్ గంప గొవర్దన్ ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి కామారెడ్డి పోలిస్ స్టేషన్‌కు తరలించారు.
Read More »21 నుండి పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ఈనెల 21న ”పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమం స్మతి పరేడ్ నిర్వహించి అమర వీరుల త్యాగానికి నివాళులు అర్పించడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 15 నుండి సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం జరిగేవని, కానీ ఈ సంవత్సరం నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ...
Read More »