నిజామాబాద్, అక్టోబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలం పంట నుండి సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్‌గా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరములో 2020-21 సంవత్సరం వానకాల పంట వరి ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లైస్, వ్యవసాయ, సహకార, మెప్మా, రైస్ మిల్లర్స్, ట్రేడర్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు లాభం చేకూరే విధంగా గ్రేడ్ ఏ రకం 1888 రూపాయలు, సాధారణ రకం 1868 రూపాయలు మద్దతు ధర క్వింటాలుకు నిర్ణయించారని, రైతులు వరి ధాన్యం మద్దతు ధర పొందడానికి ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, చెత్త, తాలు, మట్టిపెళ్లలు, రాళ్లు లేకుండా శుభ్రపరచాలని తెలిపారు. తేమ 17 శాతం ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో, చెల్లింపుల్లో మధ్యవర్తుల ప్రమేయానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆన్లైన్ ద్వారా నేరుగా రైతు ఖాతాలోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. అందుకు ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా పాసుబుక్ జిరాక్స్, రైతు మొబైల్ నెంబర్ ఉండాలన్నారు. లీగల్ మెట్రాలజీ చాలా బాగా పనిచేస్తుందన్నారు. ప్రతి వే బ్రిడ్జ్ చెక్ చేయాలన్నారు. టార్పాలిన్, తేమకొలత మీటర్లు రెడీగా ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం ఉండాలన్నారు.
రెవెన్యూ, వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ట్రేడర్స్‌కు, మిల్లర్సుకు సపోర్ట్ చేస్తామన్నారు. మొత్తం 445 కొనుగోలు కేంద్రాలు (ఐకేపీ 37 ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీలు 367, ఐడిసిఎంఎస్ 19, మెప్మా 7, హాకా 1, మార్కెటింగ్ శాఖ 14) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించే పోస్టర్స్, మొబైల్ యాప్ లాంచ్ చేశారు. దాన్యం ట్రాన్స్ పోర్ట్‌కు వాహనాల ఇబ్బంది ఉండరాదన్నారు.
రైస్ మిల్కు వచ్చిన ధాన్యం వెంటనే దింపాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర కోవిడ్ జాగ్రత్తలు పాటించాలన్నారు. అక్టోబర్ నుండి నవంబర్ వరకు 45 రోజులు ధాన్యం కేంద్రాలకు వస్తుందని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డివోలు రవి, శ్రీనివాస్, రాజేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021