Breaking News

బీమా కల్పించి ఉంటే అండగా ఉండేది…

కామారెడ్డి, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కామారెడ్డి పట్టణ బందం ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా పాడయిన పంటలను చూసి రైతులతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల రైతులకు చేతికందిన పంట నాశనం అయ్యి తీవ్ర నష్టం వాటిల్లిందని పెట్టిన పెట్టుబడి నిండా మునిగే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన ద్వారా బీమా కల్పించి ఉంటే ఇలాంటి సమయంలో ఎంతో అండగా ఉండేదని పేర్కొన్నారు. పత్తి, సొయా, చెరుకు, వరి, ఇతర కూరగాయ పంటలన్ని పాడయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

అదే విధంగా కొత్త వ్యవసాయ చట్టంపై రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్టు అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు చేతికి వచ్చిన మక్కలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఎందుకు కొనుగోలు చేయటం లేదని అన్నారు. కామారెడ్డి జిల్లాలో దాదాపు 8 మండలాలలో మక్క ప్రధాన పంట అని 2, 3 రోజుల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లేకపోతే రైతు ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Check Also

విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ ...

Comment on the article