Breaking News

అందరికి ఆదర్శం కలాం జీవితం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అబ్దుల్‌ కలాం జీవితం అందరికీ ఆదర్శనీయమని విశ్వతేజస్‌ అధ్యక్షుడు తక్కూరి హన్మాండ్లు అన్నారు. భారత దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు కలాం అని ఆయన పేర్కొన్నారు. విశ్వతేజస్‌, వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ సంస్థల ఆద్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ 89వ జయంతిని నిజామాబాదు నగరం ఖలీల్‌ వాడిలో గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా విశ్వతేజస్‌ సంస్థ అధ్యక్షుడు తక్కురి హన్మాండ్లు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో కలాం చేసిన సేవలతో దేశ గౌరవం పెంపొందించారన్నారు. కలాం నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికి కషి, పట్టుదలతో ప్రపంచం కీర్తించే స్థాయికి చేరుకున్నారని అన్నారు.

కలామ్‌ ఆశయసాధనకై తమ సంస్థ తనవంతు కషి చేస్తుందని, ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాల్లో వేలాది మంది విద్యార్థులకు కెరియర్‌ గైడెన్స్‌, గోల్‌ సెట్టింగ్‌ లాంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హన్మాండ్లు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సి.హెచ్‌ శ్రీనివాస్‌, చింతల గంగదాస్‌, పెందోటి చంద్ర శేఖర్‌, కర్క రమేష్‌, మైత్రి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

గతంలో లాగా కాకుండా కొత్తగా పనిచేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌ అవగాహనా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article