Breaking News
CP Kartikeya

21 నుండి పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ఈనెల 21న ”పోలీస్‌ ఫ్లాగ్‌ డే” కార్యక్రమం స్మతి పరేడ్‌ నిర్వహించి అమర వీరుల త్యాగానికి నివాళులు అర్పించడం జరుగుతుందని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21న పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని, అక్టోబర్‌ 15 నుండి సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం జరిగేవని, కానీ ఈ సంవత్సరం నుండి పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి నామకరణం మార్పు చేసి ”పోలీస్‌ ఫ్లాగ్‌ డే” గా వ్యవహరిస్తూ సంస్మరణ కార్యక్రమాలను అక్టోబర్‌ 21 నుండి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి అయిన అక్టోబర్‌ 31వ తేదీ జాతీయ ఐక్యత దినోత్సవం వరకు జరపడానికి ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా, కార్యక్రమాలను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అమలు చేస్తామని వివరించారు.

తెలంగాణ రాష్ట్ర డీ.జీ.పీ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, కమిషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌, పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈనెల 21 నుండి 31 వరకు పోలీస్‌ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు జరుపనున్నట్టు అన్నారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, త్యాగాలు, సాంకేతిక వినియోగం, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థ తదితర విషయాలు ప్రజలకు వివరిస్తామన్నారు.

కరొన వైరస్‌ వ్యాప్తి సమయంలో ప్రజల రక్షణలో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ పాత్ర చేసిన సేవలు, నిర్వర్తించిన విధుల అంశంపై విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహించి మొదటి ముగ్గురికి ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. అలాగే రక్తదాన శిబిర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, పోలీస్‌ అమరవీరుల త్యాగాల గురించి గ్రామాలలో ప్రజలకు తెలియజేయడం మరియు ప్రజల సమస్యలు తెలుసుకోవడం అట్టి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని సిపి కార్తికేయ తెలిపారు.

పోలీస్‌ అమరవీరుల కుటుంబాలకు దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించడం, లఘు చిత్రాలు, ఫోటోల పోటీలు, పోలీస్‌ ఫ్లాగ్‌ డే లో భాగంగా పోలీస్‌ త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే తక్కువ విడిది గల షార్ట్‌ ఫిలిమ్స్‌, ఇటీవల తీసిన ఫోటోలు, ఆర్టికల్‌ల పై ఈనెల 19 లోపు ప్రజా సంబంధాల అధికారి (పి.ఆర్‌.ఓ) కి అందించాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా సెల్‌ నెంబర్‌ 94400 01827 కు సంప్రదించాలన్నారు.

ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పబ్లిక్‌ స్థలాల్లో, పోలీస్‌ అమరవీరుల గురించి తెలుపుతూ పోలీస్‌ బ్యాండ్‌, కళా బ ందం తో పాటల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అక్టోబర్‌ 21న పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నందు ”పోలీస్‌ అమరవీరుల సంస్మరణలో ఘనంగా నివాళులు అర్పిస్తూ ”స్మతి పరేడ్‌” నిర్వహించడం జరుగుతుందన్నారు.

ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుని ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ”పోలీస్‌ ఫ్లాగ్‌ డే” కార్యక్రమాలు నిర్వహిస్తామని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ తెలిపారు.

The following two tabs change content below.

Check Also

గతంలో లాగా కాకుండా కొత్తగా పనిచేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌ అవగాహనా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article