Breaking News

అయ్యా! పాలకులారా వారి గోసచూడండి…

బోధన్‌, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల మూలంగా రైతులు హర్వెస్టింగ్‌ చేసి, ఆరబెట్టిన ధాన్యమంత తడిసి ముద్దయిందని, హర్వెస్టింగ్‌ చేయని పంట సేలలో పడిపోయి మొలకలు వచ్చి రైతుల బతుకు ఆగమైందని, ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో రైతులు తడిసిపోయి ఆరబెడుతున్న వరి ధాన్యాన్ని, పంట పొలాలను పరిశీలించిన సీపీఐ (ఎం- ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ, ఏఐకేఏంఎస్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకతి కన్నెర్రకు రైతన్నకు మళ్లీ కన్నీరే మిగిలిందని ఆరుగాలం కష్ట పడి పండిచిన పంట కండ్ల ముందే నీట మునిగి ఆరబోసిన ధాన్యం (వడ్లు) తడిసి పో యిందని ఎవ్వరు ముందు కొచ్చి కొనుగోలు చేయక పోవడంతో రైతులు ఆగమైతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటి లాగే అదికారులు పంట నష్టాన్ని అంచనా వేసి, నివేధికలు ప్రభుత్వానికి పంపడం, ప్రభుత్వం ఒక్క రుపాయి కూడా నష్ట పోయిన రైతులకు ఇవ్వక పోవడం చూస్తున్నదే కదా అని మండి పడ్డారు.

అయ్యా! పాలకులారా, రైతుల పంట సేనులకు వచ్చి, వారి గోస చూడండని వారు పడుతున్న కష్టాలను చూడండని, వారు నష్ట పోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించి, వారి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బి. మల్లేష్‌, గుమ్ముల గంగాధర్‌, పోశెట్టి, వీరాస్వామి, నర్సింలు, శంకర్‌ గ్రామ రైతులు పాల్గొన్నారు.

Check Also

కేంద్రాల్లో ధాన్యం నిలువ ఉండకుండా చూడాలి

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా ...

Comment on the article