Breaking News

అత్యవసర సమయంలో యువకుల రక్తదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో లక్ష్మీ అనే యువతి రక్త లేమితో చికిత్స పొందుతూ అత్యవసర సమయంలో ఓ – నెగిటివ్‌ రక్తం అవసరముందని కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్‌ గ్రూప్‌ నిర్వాహకులు బొనగిరి శివ, ఆంజనేయులును సంప్రదించారు.

వారు రక్తదాతలు మధుసుధన్‌ రెడ్డి, రమేష్‌ల సహకారంతో ఫోన్‌లో సంప్రదించారు. సేవ దక్పథంతో స్వచ్చందంగా ముందుకు వచ్చి అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు.

రక్తదానానికి ముందుకు వచ్చిన వారికి కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహం నిర్వాహకులు కతజ్ఞతలు తెలిపారు. రక్తదాన కార్యక్రమంలో రక్తదాతలు మధుసూదన్‌ రెడ్డి, రమేష్‌లు, ప్రతినిధులు ఏనుగందుల నవీన్‌, రాజు, వీటి ఠాగూర్‌ రక్తనిథి నిర్వాహకులు చందన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి భిక్కనూరు మండలం బస్వాపూర్‌ ...

Comment on the article