Breaking News

Daily Archives: October 16, 2020

గంటకు రూ.2500 లకు మించి వసూలు చేయరాదు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో 2020 వానా కాలపు వరి పంటలకు అధిక వర్షాల వలన ట్రాక్టరు చేల్లోకి వెల్లే పరిస్తితి లేదని, ఇదే అదనుగా తీసుకొన్న హార్వెస్టర్‌ల యజమానులు తమ ఇష్టం వచ్చినట్లు రేట్లు వసూలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ దష్టికి తేవడం జరిగింది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులకు గురవుతారని కనుక ప్రస్తుత పరిస్తితుల్లో రైతు శ్రేయస్సు దష్ట్యా వరి కోతకు ఎకరానికి, గంటకు 2500 రూపాయలకు మించి వసూలు చేయరాదని, ...

Read More »

సెలవుల్లో కూడా పనిచేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హౌస్‌ హోల్డ్‌ సర్వే, పల్లె ప్రకతి వనాలు, రైతు వేదికలు, సేక్రిగ్రైషన్‌ షెడ్స్‌, వైకుంఠ దామాలు, అక్టోబర్‌ 20 తేదీ వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పిఆర్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాపర్టీ నమోదు ప్రక్రియ అక్టోబర్‌ 20 వ తేదీ నాటికి పూర్తి కావాలని, అందుకు రెండు రోజులు ...

Read More »

దళారులను నమ్మొద్దు

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీ, ఐకెపి, మార్కెట్‌ కమిటీలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని అన్నారు. ధాన్యాన్ని విక్రయించిన పది రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి కన్న కలలు సాకారం కాబోతుందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు గోదావరి ఉత్తర తెలంగాణకు రెండు ...

Read More »

నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ 7 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రోజుల నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీగా ఇన్‌ ఫ్లో రావడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ 7 వరద గేట్ల ద్వారా 49504 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరలోకి విడుదల చేయడం జరుగుతుందని ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 నీటి నిల్వను ఉంచుతూ అదనంగా వస్తున్న నీటిని గేట్ల ద్వారా విడుదల చేయడం జరుగుతుందన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు లోనికి ...

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేసారు. రేషన్‌ షాప్‌ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన మహిళలకు చీరలను అందజేశారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు వనిత, నరేందర్‌, వంశీ కష్ణ, రేషన్‌ డీలర్‌ కస్తూరి నరహరి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Read More »

ఉచిత కుట్టు మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోండి…

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మలా ఫౌండేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషిన్‌ శిక్షణ మరియు శిక్షణ అనంతరం 5 వేల రూపాయల విలువ గల కుట్టు మిషిన్‌, సర్టిఫికేట్‌ కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం కుట్టు మిషిన్‌ శిక్షణ పొందిన వారు కూడా అర్హులని, అందుకు గాను ఈనెల 20వ తేదీ చివరి రోజుగా నిర్ణయించామన్నారు. అర్హులైన వారు పరీక్ష ఫీజు 900 రూపాయలు, ...

Read More »

రైతులు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం…

బాన్సువాడ, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు క్షేమంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలో శుక్రవారం కొనుగోలు కేంద్రాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై స్పీకర్‌ మాట్లాడారు. వానకాలంలో రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ...

Read More »

ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది…

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాలు సజావుగా నిర్వహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. ఎల్లారెడ్డి లోని ముత్యపు రాఘవులు ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సూచించారు. కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌ ...

Read More »

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని, ప్రతీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లి విరిసేలా దీవించాలని అమ్మవారిని మంత్రి ప్రార్థించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు ...

Read More »

దీపావళి లోపు కొత్త కలెక్టరేట్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బైపాస్‌ రోడ్డు దుబ్బాలోని ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. జిల్లా కలెక్టర్‌ ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. దసరాకు కంప్లీట్‌ చేసుకోవాలన్న ఉద్దేశంతో పనులు చేసుకుంటూ వచ్చామని, మధ్యలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం ద్వారా బాగా వర్కింగ్‌ డేస్‌ లాస్‌ కావడం జరిగిందని, దానికి అనుగుణంగా రీ ప్లాన్‌ చేసుకున్నామన్నారు. నిజామాబాద్‌ ...

Read More »

మంజీరా నదికి స్పీకర్‌ పూజలు

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద మంజీరా నదికి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి శుక్రవారం ప్రత్యేక హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. వర్షాకాలం కావడంతో ఎగువ నుండి వస్తున్న వరదతో నది నిండు కుండలా మారింది. కార్యక్రమంలో జుక్కల్‌ శాసనసభ్యులు హన్మంత్‌ షిండే, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, కామారెడ్డి జిల్లా జడ్పి చైర్మన్‌ ధఫేదార్‌ శోభా రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ...

Read More »

అడ్మిషన్లు ఒకచోట తరగతులు మరోచోట

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల అడ్మిషన్లను ఒక కళాశాలలో, తరగతులను మరొక కళాశాలలో నిర్వహిస్తామని విద్యార్థులకు చెబుతున్నారని, ఈ విధంగా చేసినట్లయితే ఆయా యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేపిస్తామని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు కుంభాల లక్ష్మణ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కొన్ని కళాశాలలకు ఒకటి కంటే ఎక్కువ డిగ్రీ ...

Read More »

మునిసిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేసింది

బోధన్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌లోని కరణం కుంట (బతుకమ్మ కుంట) ను మున్సిపల్‌ చైర్మన్‌ తూము పద్మ శరత్‌ రెడ్డి శుక్రవారం సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలను బోధన్‌ పట్టణములో ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ ఆదేశానుసారం ఘనంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేసిందని మున్సిపల్‌ చైర్మన్‌ తూము పద్మ శరత్‌ రెడ్డి అన్నారు. రాకాసిపెట్‌ లోని కరణం కుంట(బతుకమ్మ కుంట) అభివద్ధి పనులను చైర్మన్‌ సందర్శించారు. ఆమె వెంట కౌన్సిలర్లు శరత్‌ ...

Read More »

రిలయన్స్‌ జియోలో ఉద్యోగావకాశాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ కామారెడ్డి ద్వారా ఇజిఎంఎం ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు రిలయన్స్‌ జియో సంస్థలో హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలున్నట్టు డిఆర్‌డిఎ కామారెడ్డి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19 సోమవారం రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ భవనంలో జాబ్‌ మేళా ఉంటుందన్నారు. నిరుద్యోగ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు హైదరాబాద్‌లో జియో ఫైబర్‌ ఇంజనీర్‌, జియో ఫైబర్‌ అసోసియేట్‌, హోం సేల్స్‌ ఆపీసర్‌గా ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్తులు 18 ...

Read More »