Breaking News

ఉచిత కుట్టు మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోండి…

కామారెడ్డి, అక్టోబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మలా ఫౌండేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషిన్‌ శిక్షణ మరియు శిక్షణ అనంతరం 5 వేల రూపాయల విలువ గల కుట్టు మిషిన్‌, సర్టిఫికేట్‌ కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం కుట్టు మిషిన్‌ శిక్షణ పొందిన వారు కూడా అర్హులని, అందుకు గాను ఈనెల 20వ తేదీ చివరి రోజుగా నిర్ణయించామన్నారు.

అర్హులైన వారు పరీక్ష ఫీజు 900 రూపాయలు, ఆధార్‌ కార్డు కలర్‌ జిరాక్స్‌, కలర్‌ ఫొటోస్‌ (3) తో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థుల వయసు 16-40 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. కామారెడ్డి జిల్లా లోని అన్ని మండలాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు కామారెడ్డి 9948420702, ఎల్లారెడ్డి 9849861094 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

The following two tabs change content below.

Check Also

యువకుని రక్తదానం

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరికొండ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన అమ్ము 33 ...

Comment on the article