నిజామాబాద్, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో 2020 వానా కాలపు వరి పంటలకు అధిక వర్షాల వలన ట్రాక్టరు చేల్లోకి వెల్లే పరిస్తితి లేదని, ఇదే అదనుగా తీసుకొన్న హార్వెస్టర్ల యజమానులు తమ ఇష్టం వచ్చినట్లు రేట్లు వసూలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దష్టికి తేవడం జరిగింది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులకు గురవుతారని కనుక ప్రస్తుత పరిస్తితుల్లో రైతు శ్రేయస్సు దష్ట్యా వరి కోతకు ఎకరానికి, గంటకు 2500 రూపాయలకు మించి వసూలు చేయరాదని, ఎవరైనా అంతకు ఎక్కువ వసూలు చేసినట్లు తమ దష్టికి వచ్చినట్లయితే సదరు వాహనాన్ని జప్తు చేసి, యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విషయంలో సంబంధిత తహసిల్దార్, వ్యవసాయ అధికారి మరియు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లకు 1800 4256644, 08462 220183 ఫోన్ చేసి తెలపాల్సిందిగా కోరారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021