నిజాంసాగర్, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీ, ఐకెపి, మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని అన్నారు. ధాన్యాన్ని విక్రయించిన పది రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి కన్న కలలు సాకారం కాబోతుందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు గోదావరి ఉత్తర తెలంగాణకు రెండు పంటలకు సాగునీరు అందుతాయన్నారు.
అలాగే కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట్ తదితర ప్రాంతాల్లో కొత్త ఆయకట్టలకు కూడా నీరు వస్తున్నాయన్నారు. జుక్కల్, బాన్సువాడ, బోధన్ వరప్రదాయిని నీరు రెండు పంటలకు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే యాసంగి పంటకు ఢోకా లేదన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో వరి, 10 లక్షల ఎకరాల్లో వేరే పంటలు వేయడం జరిగిందన్నారు.
ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రాజెక్ట్ నిజాంసాగర్ ప్రాజెక్టు అన్నారు. రైతులు మార్చి 15 వరకు పంటలు ముందే వేసుకునే విధంగా చూడాలని స్పీకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కామారెడ్డి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ ధపెదర్ శోభ రాజు, డిసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గా రెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సాధుల సత్యనారాయణ, పిట్లం ఎయంసి వైస్ చైర్మన్ గైని విఠల్, సర్పంచులు అనసూయ సత్యనారాయణ, సిడిసి చైర్మన్ గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- జిల్లా కలెక్టర్కు సన్మానం - January 19, 2021
- విద్యాసంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తిచేయాలి - January 19, 2021
- వృద్ధురాలికి రక్తదానం - January 19, 2021