నిజామాబాద్, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హౌస్ హోల్డ్ సర్వే, పల్లె ప్రకతి వనాలు, రైతు వేదికలు, సేక్రిగ్రైషన్ షెడ్స్, వైకుంఠ దామాలు, అక్టోబర్ 20 తేదీ వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పిఆర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాపర్టీ నమోదు ప్రక్రియ అక్టోబర్ 20 వ తేదీ నాటికి పూర్తి కావాలని, అందుకు రెండు రోజులు సెలవుల్లో కూడా పనిచేయాలని ఆదేశించారు.
నమోదులో మండలాల ఎంపిఓ, పంచాయతీ సెక్రెటరీ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని పూర్తి చేయాలన్నారు. అర్బన్ ఏరియాలో మున్సిపల్, రెవిన్యూ, అంగన్వాడి, మెప్మా అధికారులు పాల్గొనాలని, నాలుగు మున్సిపాలిటీలలో శని, ఆదివారాలు పని జరగాలన్నారు. బతుకమ్మ సారీస్ వీలైనంత తొందరగా అన్ని గ్రామాలలో, మునిసిపాలిటీలలో పంచాలని, 60 సంవత్సరాలు ఉన్నవారికి, వికలాంగులకు ఇంటి వద్ద ఇవ్వాలని, రెండు రోజుల్లో పూర్తి పంపిణీ జరిగేలా ప్రతి జిపిలో తాసిల్దార్, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ చూడాలన్నారు.
పల్లె ప్రకతి వనాలు హ్యాబిటేషన్ వారిగా ల్యాండ్ ఐడెంటిఫై చేసి ప్లాంటేషన్ జరిగే విధంగా చూడాలన్నారు. బుధవారం వరకు 100 శాతం విలేజ్ పార్కులు ఆన్లైన్ కావాలని తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ లేబర్ బాగుందని, ఉపయోగపడే పనులు చేయించాలన్నారు. కటింగ్, శానిటేషన్, హరితహారం పనులు చేయించాలన్నారు. వైకుంఠ ధామాలు 20 వ తేదీ వరకు పూర్తి చేయాలన్నారు.
పెండింగ్‌లో ఉన్న గ్రామ సర్పంచ్‌లను మరో వీడియో కాన్ఫరెన్సుకు పిలవాలన్నారు. 3 తేదీ నుండి 5 వ తేదీ వరకు ఏవెన్యూ ప్లాంటేషన్ పరిశీలనకు అధికారులు వస్తారని, ప్రతి ఐదు మీటర్లకు మొక్క ఉండాలన్నారు. అధికారుల రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, డిఆర్డిఎ పిడి శ్రీనివాస్, జెడ్పీ సీఈవో గోవింద్ డిపిఓ జయసుధ, ఈఈ పిఆర్ శంకర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021