Breaking News

దీపావళి లోపు కొత్త కలెక్టరేట్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బైపాస్‌ రోడ్డు దుబ్బాలోని ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. జిల్లా కలెక్టర్‌ ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.

దసరాకు కంప్లీట్‌ చేసుకోవాలన్న ఉద్దేశంతో పనులు చేసుకుంటూ వచ్చామని, మధ్యలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం ద్వారా బాగా వర్కింగ్‌ డేస్‌ లాస్‌ కావడం జరిగిందని, దానికి అనుగుణంగా రీ ప్లాన్‌ చేసుకున్నామన్నారు. నిజామాబాద్‌ టౌన్‌ నుంచి వచ్చే డ్రైన్‌ ప్రాపర్‌గా డైవర్ట్‌ చేసుకుంటూ డ్రైన్‌ మీద నుండి కలెక్టరేటుకు రోడ్డు వేసుకోవాల్సి ఉందని, బ్రిడ్జి పూర్తి అయిందని, డ్రైన్‌ పది రోజుల్లో పూర్తవుతుందన్నారు.

ల్యాండ్‌ ఫిల్లింగ్‌, లెవలింగ్‌ వర్షాలు పడటం వల్ల కొంత చేయలేక పోయామని, వర్షాలు పడకుంటే 20 నుండి 25 రోజుల్లో పనులన్నీ పూర్తయ్యే అవకాశముందన్నారు. పనులు అయిపోయిన వెంటనే కొత్త కలెక్టరేట్‌ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గార్డెన్‌ వర్క్‌ జరుగుతుందన్నారు. రోజువారీ పనులను ప్లాన్‌ చేసుకోవాలని, రోజు మానిటర్‌ చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు.

ఆర్‌అండ్‌బి అధికారులు ఏజెన్సీ వారి కోఆర్డినేషన్‌తో పని జరగాలన్నారు. కలెక్టరేట్‌ వెనకాల పార్కింగ్‌ ప్లాట్‌ ఫారం, ఫెన్సింగ్‌, గార్డెనింగ్‌ త్వరగా పూర్తి చేయాలన్నారు. దీపావళి కన్నా ఐదు రోజుల ముందు హ్యాండోవర్‌ చేయాల్సిందిగా ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్‌అండ్‌బి ఎస్‌సి రాజేశ్వర్‌ రెడ్డి, ఈఈ రాంబాబు, ఆర్డిఓ రవి, తాసిల్దార్‌ ప్రశాంత్‌ కుమార్‌, సంబంధిత అధికారులు ఉన్నారు.

The following two tabs change content below.

Check Also

గతంలో లాగా కాకుండా కొత్తగా పనిచేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌ అవగాహనా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article