Breaking News

నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ 7 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రోజుల నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీగా ఇన్‌ ఫ్లో రావడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ 7 వరద గేట్ల ద్వారా 49504 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరలోకి విడుదల చేయడం జరుగుతుందని ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 నీటి నిల్వను ఉంచుతూ అదనంగా వస్తున్న నీటిని గేట్ల ద్వారా విడుదల చేయడం జరుగుతుందన్నారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు లోనికి పోచారం, హల్దీ వాగు, తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి 49504 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్‌ లో 57 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో 5,6,11,14,15, ఐదు వరద గేట్లను ఎత్తి 66 వేల క్యూసెక్కుల నీటిని దిగువ మంజీర నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయంలోనికి విడుదల చేస్తున్నారు.

సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా 523.425 మీటర్ల నీరు నిల్వ ఉందని డీఈ తెలిపారు. భారీ వర్షాలతో వరద నీరు వచ్చి చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల సందడి కూడా పెరిగింది.

Check Also

పెరుగుతున్న నీటిమట్టం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌, సింగూరు ...

Comment on the article