Breaking News

దసరాకు ధరణి లాంచ్‌…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌ అవగాహణపై జిల్లా కలెక్టర్లు, ఆడిషనల్‌ కలెక్టర్లు, ఆర్డిఓలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌. శనివారం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు మరియు ఆర్డీవోలకు ధరణి పోర్టల్‌ పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రెసెంటషన్‌ ఇచ్చిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు.

దసరాకు ధరణి లాంచ్‌ అవుతున్నదని, ఇది చాలా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, సేఫ్‌ అండ్‌ సెక్యూర్డుగా ఉంటుందన్నారు. అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌ భూములను ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి, స్లాట్‌ బుకింగ్‌, లాగిన్‌ ఎలా చేయాలి వంటి విషయాలు ప్రెసెంటేషన్‌ ద్వారా తెలిపారు. స్లాట్‌ తెలుగు మరియు ఇంగ్లీష్‌లో ఉంటుందన్నారు. బయ్యర్‌ డీటెయిల్స్‌, సెల్లర్‌ డీటెయిల్స్‌ ధరణి పోర్టల్‌లో ఉంటాయని, జిల్లా కలెక్టర్ల నుండి సలహాలు, అబ్యంతరాలు అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ హార్డ్‌ వేర్‌ ఉన్నదని, మీటింగ్‌ పెట్టుకొని ఎంఆర్‌ఓలకు ట్రైనింగ్‌ ఇస్తామన్నారు. ధరణి పోర్టల్‌ సులభంగా ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్సులో ఆర్మూర్‌ ఆర్డిఓ శ్రీనివాస్‌, బోధన్‌ ఆర్డిఓ రాజేశ్వర్‌, ఎంఆర్‌ఓలు, డిప్యూటీ ఎంఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

గతంలో లాగా కాకుండా కొత్తగా పనిచేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌ అవగాహనా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article