Breaking News

పండగపూట ఆడబిడ్డలు నిరుత్సాహంగా ఉండొద్దు

బాన్సువాడ, అక్టోబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్‌, రాంపూర్‌, పోచారం మరియు దేశాయిపేట్‌ గ్రామాలలో నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో పోచారం భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 6 సంవత్సరాలు అవుతుందని, గత నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏ తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ పండగ పూట నిరుత్సాహంగా ఉండకూడదని ప్రతి ఒక్కరికి ఉచితంగా బతుకమ్మ చీరలు అందిస్తున్నారన్నారు.

ఎమ్మెల్సీ కవితమ్మ బతుకమ్మ పండుగను రాష్ట్రంలో, దేశంలోనే కాదు ప్రపంచ స్థాయి దేశాలలో తెలిసేలా ఘనంగా చాటి చెప్పారన్నారు. ప్రతి ఒక్కరు కరోనా వైరస్‌ని దష్టిలో పెట్టుకొని ఈ యేడు మనస్సుకు బాధ అయిన అర్ధం చేసుకొని భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని భాస్కర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఏకైక సీఎం కెసిఆర్‌ అని, గత 6, 7 మాసాలుగా కరోనా వైరస్‌ ప్రభావం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో దెబ్బతీసిందన్నారు.

అయినప్పటికి రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో కొనే విధంగా ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రస్తుత వానాకాలంలో కూడా రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని మోసపోవదద్దని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు వడ్లు విక్రయించాలని రైతులను కోరారు.

కార్యక్రమంలో ఎంపీపీ నీరజ వెంకట్రామిరెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు పాత బాలకృష్న, వైస్‌ ఎంపీపీ హరిసింగ్‌, సర్పంచులు నారాయణ రెడ్డి, రాధ సాయిరెడ్డి, లలిత శ్రీనివాస్‌, శ్రావణ్‌ కుమార్‌, ఎంపీటీసీలు రమణ, డి.నారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మోహన్‌ నాయక్‌, నాయకులు వెంకట్‌ రాం రెడ్డి, ఎజాజ్‌, బాబా, అంబర్‌ సింగ్‌, సాయిరెడ్డి, సాయిలు, ప్రకాష్‌, జ్యోతి ప్రకాష్‌, నరహరి, హన్మాండ్లు, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

చిన్నారుల‌ను ఆదుకోవడం మా బాధ్యత

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో గత నెల‌లో ఇంటి ...

Comment on the article