Breaking News

గతంలో లాగా కాకుండా కొత్తగా పనిచేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌ అవగాహనా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి. శనివారం జిల్లాలోని ఎంఆర్‌ఓలు మరియు ఆపరేటర్లకు ధరణి పోర్టల్‌పై ప్రెసెంటషన్‌ ఇచ్చిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. గతంలో పని చేసిన తీరుగా కాకుండా కొత్తగా పనిచేయాలని, నెగెటివ్‌ ఆలోచనలు రానీయకుండా ప్రతి అధికారి పాజిటివ్గఆ వెళ్ళాలన్నారు.

ప్రభుత్వం ఇప్పుడు అన్ని ఆప్షన్లు సిటిజెన్‌కు ఇస్తున్నదని, ఎంఆర్‌ఓలు ఆధార్‌, ఫోటో దరఖాస్తుదారుదా కాదా సరి చూసుకోవాలి తప్ప రిజిస్ట్రేషన్‌ ఆపే అధికారం లేదని, ఎక్కడైనా సమస్యలుంటే అన్ని ప్రభుత్వం త్వరలో పూర్తి చేస్తదన్నారు. అందుకే ఎమ్మార్వోలు, ఆపరేటర్లు మంచిగా ట్రైనింగ్‌ తీసుకోవాలన్నారు. ఎక్కడా ఇబ్బంది కాకుండా చూడాలని, కార్యాలయములో హార్డ్‌వేర్‌ సమస్య ఉంటే తొందరగా పూర్తి చేయాలని సూచించారు.

దసరాకు ధరణి లాంచ్‌ అవుతున్నదని, ఇది చాలా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, సేఫ్‌ అండ్‌ సెక్యూర్డుగా ఉంటుందన్నారు. అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌ భూములను ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి, స్లాట్‌ బుకింగ్‌, లాగిన్‌ ఎలా చేయాలి వంటి విషయాలు ప్రెసెంటేషన్‌ ద్వారా తెలిపారు.

స్లాట్‌ తెలుగు మరియు ఇంగ్లీష్‌లో ఉంటుందన్నారు. బయ్యర్‌ డీటెయిల్స్‌, సెల్లర్‌ డీటెయిల్స్‌ ధరణి పోర్టల్‌లో ఉంటాయని తెలిపారు. సమీక్ష సమావేశంలో ఆర్మూర్‌ ఆర్డిఓ శ్రీనివాస్‌, బోధన్‌ ఆర్డిఓ రాజేశ్వర్‌, నిజామాబాద్‌ ఆర్డిఓ రవి, ఎంఆర్‌ఓలు, డిప్యూటీ ఎంఆర్‌ఓలు ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

దసరాకు ధరణి లాంచ్‌…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌ అవగాహణపై జిల్లా కలెక్టర్లు, ఆడిషనల్‌ కలెక్టర్లు, ...

Comment on the article