Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

బీర్కూర్‌, అక్టోబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బీర్కూర్‌ మండలంలోని చించోలి, కిష్టాపూర్‌, బీర్కూర్‌, భైరాపూర్‌ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. భైరాపూర్‌ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం బతుకమ్మ చీరలను ఆడపడుచులకు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, డీసీఓ శ్రీనివాస్‌, బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు అశోక్‌, బీర్కూర్‌ సొసైటీ అధ్యక్షులు గాంధీ, బైరాపూర్‌ సొసైటీ అధ్యక్షులు రామకష్ణ గౌడ్‌, బీర్కూర్‌ మాజీ జడ్పీటీసీ సభ్యులు సతీష్‌, బీర్కూర్‌ జడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్‌, బీర్కూర్‌ మండలం ఎంపీటీసీలు, సర్పంచులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రైతులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

చిన్నారుల‌ను ఆదుకోవడం మా బాధ్యత

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో గత నెల‌లో ఇంటి ...

Comment on the article