Breaking News

ఆస్తులకు పూర్తి భద్రత ఉంటుంది

కామారెడ్డి, అక్టోబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌ సేవలు ప్రజలకు పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కామారెడ్డి తహసిల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసే ప్రక్రియను ఆదివారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ నెల 25న దసరా పండుగ రోజున ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు ప్రారంభించనున్నారని చెప్పారు.

ఆస్తులకి పూర్తి భద్రత ఉంటుందని సూచించారు. తహసిల్దార్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో 10 మాదిరి రిజిస్ట్రేషన్లను చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైస్‌ మిల్లును సందర్శించారు. లక్ష్యానికి అనుగుణంగా బియ్యాన్ని తయారు చేయాలని రైస్‌ మిల్‌ యజమానిని ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, తహసిల్దార్‌ అమిన్‌ సింగ్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article