Breaking News

మహిళకు రక్తదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపెట్‌ మండలం కన్నాపూర్‌ గ్రామానికి చెందిన గ్యార బోయిన సుశీల (28) అనే మహిళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.

చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన సురేష్‌ మరియు లింగంపేట్‌ మండలానికి చెందిన మెట్రో టీవీ విలేకరి గోపాల్‌ సహకారంతో వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ఓ పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాలు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తం అందజేశామని, యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు.

కరోణ వ్యాధి నుండి కోలుకున్నవారు వారు 28 రోజుల తర్వాత ప్లాస్మా దానం చేయడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ప్రసాద్‌, శ్రీకాంత్‌, టెక్నీషియన్‌ ఏసు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article