Breaking News

బాధిత కుటుంబానికి కార్పొరేటర్‌ సాయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 49వ డివిజన్‌లో తులసి వెంకటస్వామి ఇల్లు శనివారం అర్ధరాత్రి విద్యుత్‌ షాట్‌సర్క్యూట్‌కు గురైంది. దీంతో మంటలు ఇల్లంతా వ్యాపించి ఇంటిలోని నిత్యవసర సామాగ్రి, ఫర్నీచర్‌, ఇతరత్రా వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న 49వ డివిజన్‌ కార్పొరేటర్‌ మెట్టు విజయ్‌ రూ. 20 వేలు తక్షణమే ఆర్థిక సహాయంగా అందజేశారు.

అర్ధరాత్రి కుటుంబసభ్యులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌ కావడం, మంటలతో వస్తువులు కాలిపోవడం విచారకరమని విజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా వెంకటస్వామి కుటుంబానికి పలువురు ఆసరాగా నిలుస్తూ నిత్యవసర సరుకులు, నగదు, బట్టలు సహాయం చేశారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article