Breaking News

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించిందని రైతు లందరు వాటికి వ్యతిరేకంగా పోరాడాలని సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు బి.మల్లేష్‌ పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం మోస్రా మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు.

దేశ వ్యాప్తంగా రైతులందరు వ్యతిరేకిస్తున్నా, మోడీ పట్టుబట్టి బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఆర్డినెన్సులను పార్లమెంట్లో బిల్లులుగా ఆమోదింప జేశారని, చట్టాలు రద్దయ్యే వరకూ రైతాంగం, కార్మికులు, ప్రజలు కలిసి ఉద్యమించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐకేఏంఎస్‌ జిల్లా నాయకులు గుమ్ముల గంగాధర్‌, పడాల శంకర్‌, గ్రామ సర్పంచ్‌ సున్నం భూమయ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Check Also

21 నుండి పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ఈనెల ...

Comment on the article