Breaking News

Daily Archives: October 19, 2020

ఫోన్‌ ఇన్‌లో 26 ఫిర్యాదులు

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ జనహిత భవన్‌లో సోమవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి 26 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి స్వీకరించారు. రెవెన్యూ 10, గ్రామ పంచాయతీలకు సంబంధించి 11, వ్యవసాయానికి 3, విద్యుత్‌కు సంబంధించి 2 చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, ఏవో శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ. 10 వేలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసిస్తున్నవారు ఎంతో నష్టపోయారని, ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరంలోని వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ. 10 ...

Read More »

సబ్సిడీలు వెంటనే మంజూరు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగులో ఉన్న పెట్టుబడి సబ్సిడీలు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో 41 వ టీఎస్‌-ఐపాస్‌ మరియు జిల్లా పరిశ్రమల అభివద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పెండింగులో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌, నాలా కన్వర్షన్‌లతో సహా పెండింగులో ఉన్న అన్ని సబ్సిడీలు నిబంధనల ప్రకారం ఉన్నట్లయితే వెంటనే మంజూరు చేయాలని, టి ...

Read More »

అక్రమ రవాణా అడ్డుకోవాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జంతువుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జంతు సంక్షేమ సంఘం సమావేశంలో మాట్లాడారు. జంతువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సంబంధిత జిల్లా అధికారులు కషి చేయాలని సూచించారు. కుక్కల పునరుత్పత్తిని తగ్గించడానికి టీకాలు వేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. యాంటీ రేబిస్‌ వ్యాధి టీకాలు వేయడానికి మునిసిపల్‌ కమిషనర్లు, పంచాయతీ అధికారుల సమన్వయంతో చర్యలు ...

Read More »

కామారెడ్డి జిల్లా మొదటి స్థానం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా 78 శాతాన్ని సాధించి మొదటి స్థానాన్ని పొందడానికి జిల్లా యంత్రాంగం చేసిన కషిని జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు, దిశ కమిటీ చైర్మన్‌ బీబీ పాటిల్‌ అభినందించారు. సోమవారం జనహిత భవనంలో జిల్లాలోని 22 మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన దిశపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 2.37 లక్షల మందికి పని కల్పించినట్లు తెలిపారు. ...

Read More »

ప్రశాంతంగా సాగుతున్న పరీక్షలు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ కోర్సులకు చెందిన బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ(ఎల్‌), ఎడ్యుకేషన్‌ కోర్సులకు చెందిన బిఎడ్‌, ఎంఎడ్‌ మరియు లా కోర్సులకు చెందిన ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు జరిగిన బిఎడ్‌ రెండవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 44 మంది విద్యార్థులు ...

Read More »