Breaking News

ప్రశాంతంగా సాగుతున్న పరీక్షలు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ కోర్సులకు చెందిన బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ(ఎల్‌), ఎడ్యుకేషన్‌ కోర్సులకు చెందిన బిఎడ్‌, ఎంఎడ్‌ మరియు లా కోర్సులకు చెందిన ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు.

ఉదయం 10 – 12 గంటల వరకు జరిగిన బిఎడ్‌ రెండవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 44 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 43 హాజరు, 01 గైరాజరు, ఎంఎడ్‌ మూడవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ /బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 16 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 15 హాజరు, 01 గైరాజరు, ఎల్‌ఎల్‌ఎం నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 12 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 12 హాజరు అయినట్లు తెలిపారు.

మధ్యాహ్నం 2 – 4 గంటల వరకు జరిగిన డిగ్రీ ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 930 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 834 హాజరు, 96 గైరాజరు, బిఎడ్‌ మూడవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 107 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 100 హాజరు, 07 గైరాజరు, ఎల్‌ఎల్‌బి నాల్గవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ మొత్తం 06 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 04 హాజరు, 02 గైరాజరు, ఎంఎడ్‌ మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ మొత్తం 06 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 03 హాజరు, 03 గైరాజరు అయినట్లుగా సిఇవో వివరించారు.

Check Also

పిహెచ్‌డి విద్యార్థులకు గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. కోర్సులకు చెందిన ప్రీ పిహెచ్‌.డి. ...

Comment on the article