Breaking News

కామారెడ్డి జిల్లా మొదటి స్థానం

కామారెడ్డి, అక్టోబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా 78 శాతాన్ని సాధించి మొదటి స్థానాన్ని పొందడానికి జిల్లా యంత్రాంగం చేసిన కషిని జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు, దిశ కమిటీ చైర్మన్‌ బీబీ పాటిల్‌ అభినందించారు. సోమవారం జనహిత భవనంలో జిల్లాలోని 22 మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన దిశపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 2.37 లక్షల మందికి పని కల్పించినట్లు తెలిపారు. 150 కోట్ల రూపాయలు కూలీలకు అందజేశారని ఆయన పేర్కొన్నారు.

జిల్లాలో పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా 104 రైతు వేదిక భవనాలు నిర్మించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం పట్ల ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా గేదెలు, గొర్రెల పెంపకం దారులకు షెడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రైతులు, గొర్రెల పెంపకం దారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు ఎంపి దష్టికి తెచ్చారు.

ఈ విషయాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి మంజూరు చేసే విధంగా కషి చేస్తానని చెప్పారు. వ్యవసాయం, వైద్యం, రోడ్లు, ఐసిడిఎస్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌పై సమీక్ష నిర్వహించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీపీలు కోరారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తానని ఎంపీ తెలిపారు.

పంట పొలాల వద్దకు కొత్తగా రోడ్డులో నిర్మించడానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు ఇవ్వాలని ప్రజా ప్రతినిధులు కోరారు. జిల్లాలో 2.15 లక్షల మంది రైతులకు భూసార పరీక్షలు నిర్వహించి కార్డులను అందజేశామని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ అధికారిని సునీత తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యులను భర్తీ చేయాలని ఎంపీపీలు కోరారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి భిక్కనూరు మండలం బస్వాపూర్‌ ...

Comment on the article