Breaking News

అక్రమ రవాణా అడ్డుకోవాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జంతువుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జంతు సంక్షేమ సంఘం సమావేశంలో మాట్లాడారు. జంతువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సంబంధిత జిల్లా అధికారులు కషి చేయాలని సూచించారు. కుక్కల పునరుత్పత్తిని తగ్గించడానికి టీకాలు వేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.

యాంటీ రేబిస్‌ వ్యాధి టీకాలు వేయడానికి మునిసిపల్‌ కమిషనర్లు, పంచాయతీ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో జంతువుల సంక్షేమంలో మానవాళి పాత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కామారెడ్డి బాలుర పాఠశాలకు చెందిన ఎల్‌.రోజా, వి.సౌజన్య, ఏం. వరలక్ష్మి బహుమతులు అందుకున్నారు.

కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జగన్నాథ చారి, డీఈవో రాజు, ఆర్టీవో వాణి, ప్రధానోపాధ్యాయులు దీపాలా రాథోడ్‌, అధికారులు, జంతు సంక్షేమ సంఘం ప్రతినిధులు సిద్ధిరాములు, రమేష్‌ పాల్గొన్నారు.

Check Also

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి భిక్కనూరు మండలం బస్వాపూర్‌ ...

Comment on the article