Breaking News

సబ్సిడీలు వెంటనే మంజూరు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగులో ఉన్న పెట్టుబడి సబ్సిడీలు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో 41 వ టీఎస్‌-ఐపాస్‌ మరియు జిల్లా పరిశ్రమల అభివద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ పెండింగులో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌, నాలా కన్వర్షన్‌లతో సహా పెండింగులో ఉన్న అన్ని సబ్సిడీలు నిబంధనల ప్రకారం ఉన్నట్లయితే వెంటనే మంజూరు చేయాలని, టి ప్రైడ్‌ క్రింద ఎస్సీలకు పెండింగులో ఉన్న 14 రుణాలు, ఎస్టీలకు పెండింగులో ఉన్న 24 రుణాలను వెంటనే మంజూరు చేయాలన్నారు.

సకాలంలో సమర్పించని రెండు అప్లికేషన్లు రిజెక్ట్‌ చేయడం జరిగిందని, వీలైనంత వరకు సకాలంలో అందిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశానికి పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ బాబురావు, విద్యుత్‌ శాఖ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి సంధ్యారాణి, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article