Breaking News

Daily Archives: October 20, 2020

మాస్క్‌లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే

హైదరాబాద్‌ ప్రతినిధి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాతో భారత్‌ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. కరోనా కట్టడే లక్ష్యంగా విధించిన జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగాల్లో ఇది ఏడోది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కరోనా టెస్టింగ్‌ కోసం 2 వేల ల్యాబ్‌లు ...

Read More »

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి ఆన్‌లైన్‌ ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 22న ఆసక్తిగల వారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌ లైన్‌ ద్వారా ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమంలో పోలీస్‌ స్టేషన్‌ పనితీరు, రికార్డుల వాడటం, సిబ్బంది ...

Read More »

పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పరీక్షలన్ని వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా ఉదతంగా, విస్తారంగా వర్షాలు పడి జన జీవనానికి ఆటంకం కలిగిస్తుండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాలలో ప్రస్తుతం నిర్వహిస్తున్న డిగ్రీ, బిఎడ్‌, ఎంఎడ్‌, ఎల్‌ఎల్‌బి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలను దసరా పండుగ అనంతరం ...

Read More »

రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వయసుగల చింతకుంట నర్సుబాయి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం వీక్లీ మార్కెట్‌లో తన రెండు తులాల గుండ్లు గల సంచి పోగొట్టుకుంది. చివరకు పోలీసుల సహాయంతో పోగొట్టుకున్న బంగారం తన స్వంతమైంది. వివరాల్లోకి వెళితే… నర్సుబాయి అంగడి చేయడానికి నిజామాబాద్‌ వీక్లిమార్కెట్‌కు వచ్చి రొయ్యలు కొనుగోలుచేసి డబ్బు ఇవ్వబోయి సంచి అక్కడే మరిచిపోయింది. కొద్దిసేపటికి సంచి కనబడకపోయే సరికి 1వ ...

Read More »

ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ మూడవ సంవత్సరం ఓల్డ్‌ బ్యాచ్‌ పరీక్షలు ఈనెల 21 నుంచి 23 వరకు జరగాల్సినవి వాయిదా పడినట్లు అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఈనెల 27 నుంచి జరగాల్సిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలు నిర్ణయమైన తర్వాత తెలియపరుస్తామని, మరిన్ని వివరాలకు యూనివర్సిటీ ...

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలంలోని ఇంద్రానగర్‌ గ్రామంలో ఐకెపి సంస్థ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు నష్టం కలగవద్దనే ఉదేశ్యంతో ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి 1882, కామన్‌ గ్రేడ్‌ వరి ధాన్యానికి 1868-00 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నదని, రైతులందరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు ...

Read More »

సర్పంచ్‌లకు ఆ అధికారం ఉంది…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 9 వ తేదీ లోపు జిల్లాలోని అన్ని గ్రామాలలో వైకుంఠ ధామాలు పూర్తి కావాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులు మరియు సర్పంచులను ఆదేశించారు. మంగళవారం జిల్లాల్లోని ఎంపిడివోలు, ఎంపీవోలు, సర్పంచులు తదితరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. 530 గ్రామ పంచాయితీలకు 15 రోజుల్లో మంజూరు ఉత్తర్వులు ఇచ్చామని, 97 ప్రాంతాల్లో అటవీశాఖ భూములు గుర్తించి ఇచ్చామని, సర్పంచులకు పని చేయటానికి ...

Read More »