Breaking News

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి ఆన్‌లైన్‌ ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 22న ఆసక్తిగల వారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌ లైన్‌ ద్వారా ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమంలో పోలీస్‌ స్టేషన్‌ పనితీరు, రికార్డుల వాడటం, సిబ్బంది విధుల నిర్వహణ, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న నూతన పద్ధతులు, టెక్నాలజీ వాడకం, రిసెప్షనిస్ట్‌ విధులు, ఆయుధాల వాడకం, కోర్టు సిబ్బంది విధులు తదితర విషయాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి సందేహాలున్న సెల్‌ ఫోన్‌ నెంబర్‌ 94404-73404 లో సంప్రదించాలని సూచించారు.

The following two tabs change content below.

Check Also

ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్‌ ...

Comment on the article