పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పరీక్షలన్ని వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా ఉదతంగా, విస్తారంగా వర్షాలు పడి జన జీవనానికి ఆటంకం కలిగిస్తుండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాలలో ప్రస్తుతం నిర్వహిస్తున్న డిగ్రీ, బిఎడ్‌, ఎంఎడ్‌, ఎల్‌ఎల్‌బి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలను దసరా పండుగ అనంతరం నిర్వహించనున్నట్టు భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని ఆయా కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించవలసిందిగా సిఇవో కోరారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌ సైట్‌ను సంప్రదించవలసిందిగా ఆయన సూచించారు.

Check Also

సేవాలాల్‌ మహారాజ్‌ ఆదేశాలు అనుసరణీయం

ఇందల్వాయి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేవాలాల్‌ మహారాజ్‌ ఆదేశాలు పాటించడమే మనందరికీ మంచిదని అదేవిధంగా ...

Comment on the article