ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ మూడవ సంవత్సరం ఓల్డ్‌ బ్యాచ్‌ పరీక్షలు ఈనెల 21 నుంచి 23 వరకు జరగాల్సినవి వాయిదా పడినట్లు అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అదేవిధంగా ఈనెల 27 నుంచి జరగాల్సిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలు నిర్ణయమైన తర్వాత తెలియపరుస్తామని, మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ లేదా 7382929612 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

Check Also

వ్యాక్సిన్‌ నూరు శాతం సురక్షితమైనది

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16 నుండి ప్రారంభించే కోవిడు వ్యాక్సిన్‌ నూటికి ...

Comment on the article