Breaking News

రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వయసుగల చింతకుంట నర్సుబాయి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం వీక్లీ మార్కెట్‌లో తన రెండు తులాల గుండ్లు గల సంచి పోగొట్టుకుంది. చివరకు పోలీసుల సహాయంతో పోగొట్టుకున్న బంగారం తన స్వంతమైంది. వివరాల్లోకి వెళితే… నర్సుబాయి అంగడి చేయడానికి నిజామాబాద్‌ వీక్లిమార్కెట్‌కు వచ్చి రొయ్యలు కొనుగోలుచేసి డబ్బు ఇవ్వబోయి సంచి అక్కడే మరిచిపోయింది.

కొద్దిసేపటికి సంచి కనబడకపోయే సరికి 1వ టౌన్‌లో ఫిర్యాదు చేసింది. స్పందించిన ఎస్‌ఐ సాయినాథ్‌, కానిస్టేబుల్‌ నారాయణ వీక్లి మార్కెట్‌లోని రొయ్యల దుకాణం వద్దకు చేరుకొని రొయ్యలు అమ్మిన మహిళను విచారించారు.

సంచి మరిచిపోయిన విషయం నిజమేనని పిలుస్తుంటే వెళ్ళిపోయిందని, కాగా అదే రంగు చీరగల వేరొక మహిళకు పొరపాటున ఇచ్చానని తెలిపింది. పోలీసులు రంగంలోకి దిగి సిసి కెమెరాల ఆధారంగా ఆటో వాలాలను విచారించి సదరు మహిళ మంచిప్ప గ్రామానికి చెందిన వారుగా గుర్తించి ఆమె వద్ద నుంచి రెండు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నర్సుబాయికి తన బంగారం అందజేయగా పోలీసులును దేవుడు చల్లగా చూడాలని ఆనందం వ్యక్తం చేసింది.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article