Breaking News

యువకుని రక్తదానం

కామరెడ్డి, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరికొండ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన అమ్ము 33 సంవత్సరాల వయసు కలిగిన మహిళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్త హీనతతో బాధపడుతుండగా వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు.

కామారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన నగేష్‌ సహకారంతో ఓ పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. గత నాలుగు నెలల కాలంలోనే 300 యూనిట్ల రక్తాన్ని, 30 మందికి ప్లాస్మాను సకాలంలో అందించడం జరిగిందని, అత్యవసర పరిస్థితుల్లో యువత రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రోగి బంధువులు, టెక్నీషియన్‌ ఏసుగౌడ్‌ పాల్గొన్నారు.

Check Also

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి భిక్కనూరు మండలం బస్వాపూర్‌ ...

Comment on the article