Breaking News

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 40 మందికి 40 లక్షల 5 వేల రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 వేల 942 మందికి 29 కోట్ల 6 లక్షల 10 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లను మగ పిల్లావానితో సమానంగా పెంచాలన్నారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, పేదింటి తల్లి దండ్రులకు ఆడపిల్ల పెళ్ళి భారం కాకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్‌ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article