Breaking News

నిబంధనలు పాటించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో టెలీ కాన్ఫరెన్సులో అధికారులతో మాట్లాడారు. తహసిల్దార్‌ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ధరణి పోర్టల్‌ను ఈ నెల 25 న ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి తహసీల్దార్‌, ఉప తహసీల్దార్‌ 10 చొప్పున మాదిరి రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించారు. పకడ్బందీగా ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగే విధంగా చూడాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Check Also

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి భిక్కనూరు మండలం బస్వాపూర్‌ ...

Comment on the article