Breaking News

డిగ్రీలు, పిజిలు చదివారు.. ఇప్పుడేమయింది…

కామారెడ్డి, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరొనా కారణంగా గత మార్చి నుండి పాఠశాలలు మూసివేయటంతో ప్రయివేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బిజెవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మూతికి నల్ల రిబ్బన్‌ కట్టుకొని మౌన దీక్ష చేపట్టారు.

అనంతరం రెండు రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న దోమకొండ మండలానికి చెందిన ప్రయివేటు ఉపాధ్యాయుడు పోతు కిషోర్‌ ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంధర్‌ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం ఉన్న గురువులు నేడు కరొనా కారణంగా జీతాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారని, తెలంగాణ ఆవిర్బావం తర్వాత కొలువులు వస్తాయని కోటి ఆశలతో ఉన్న నిరుద్యోగుల ఆశలన్నీ వమ్ము అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

డిగ్రీలు, పీజీలు చదివి చాలి చాలని జీతాలతో ప్రయివేటు పాఠశాలాల్లో పని చేస్తున్న గురువులకు ఇప్పుడు ఇల్లు గడవటమే గగనమయ్యిందని, తరగతులు జరగనందున, పీజులు రానందున జీతాలు ఇవ్వలేం అని యాజమాన్యాలు చేతులెత్తేశాయని ఆత్మాభిమానం చంపుకొని వేరే పనులు చేయలేక దిక్కు తోచని పరిస్థితిలో ఎంతో మంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అయినా ప్రభుత్వం వాళ్లకు ఎలాంటి భరోసా ఇవ్వలేక పోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ప్రయివేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

పదవీ విరమణ

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి కార్యాలయములో పబ్లిసిటీ ...

Comment on the article