Breaking News

రసాయన శాస్త్రంలో డాక్టరేట్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగంలో గురువారం పి. రమేష్‌ నాయక్‌కు పిహెచ్‌.డి. డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగంలో అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. ఎ. నాగరాజు పర్యవేక్షణలో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో ”సింథసిస్‌ ఆఫ్‌ నావెల్‌ హెటెరోసైక్లిక్‌ కాంపౌండ్స్‌ అండ్‌ స్టడీ ఆఫ్‌ థేర్‌ ఆంటిమైక్రోబియల్‌ ఆక్టివిటీస్‌” అనే అంశం పై చేసిన పిహెచ్‌. డి. పరిశోధానాంశానికి డాక్టరేట్‌ ప్రదానం చేశారు.

ఈ నెల 10 వ తేదీన డిజిటల్‌ వేదిక మీద జరిగిన వైవాకు హైదరాబాద్‌ కూకట్‌పల్లి జెఎన్‌టియూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో కెమిస్ట్రీ ఆచార్యులు ప్రొ. ఎ. తిరుమల చారి ఎక్స్‌టర్‌నల్‌ ఎగ్జామినర్‌గా విచ్చేసి పరిశోధనాంశంపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.

ఆర్‌జిఎన్‌ఎఫ్‌ ప్రతిభ గల స్కాలర్‌ అయిన పి. రమేష్‌ నాయక్‌ పిహెచ్‌. డి. సాధించడంపై ఉపకులపతి సీనియర్‌ ఐఎఎస్‌ నీతూ కుమారి ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, కెమిస్ట్రీ విభాగ అధ్యాపకులు, ఇతర విభాగ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Check Also

పిహెచ్‌డి విద్యార్థులకు గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. కోర్సులకు చెందిన ప్రీ పిహెచ్‌.డి. ...

Comment on the article