భారీగా నిషేదిత సిగరెట్లు, జర్దా స్వాధీనం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ టౌన్‌ 1 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గంజ్‌ ప్రాంతంలో ఓ కిరాణా దుకాణం మరియు గోదాములో నిషేధిత సిగరెట్లు మరియు జర్ధాను నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్టు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు.

వీటి విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందన్నారు. గురువారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకేర్‌ అలీ మరియు వారి సిబ్బంది నిజామాబాద్‌ టౌన్‌ 1 పోలీసు స్టేషన్‌ పరిధిలో గంజ్‌ సమీపంలో ఒక కిరాణా షాప్‌ మరియు గోదాములో అక్రమంగా నిషేధిత సిగరెట్లు మరియు జర్ధా ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఇంటిని తనిఖీ చేయగా సుమారు 8 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత సిగరెట్‌లు మరియు జర్ధాలను పట్టుకున్నట్టు తెలిపారు.

Check Also

అనాధ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిశు గహ, బాల సదన్‌ గహాల్లో గల అనాధ ...

Comment on the article