Breaking News

మహాధర్నా… పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు

కామారెడ్డి, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్‌ బైపాస్‌ వద్ద గురువారం నిర్వహించ తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు.

మొక్కజొన్న పంటకు మద్దతు ధర క్వింటాలుకు రూ. 1 వేయి 860 కల్పించాలని, సన్న రకం వడ్లు రూ. 2 వేల 500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళన కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల నుంచి రైతులు వాహనాల్లో తరలివచ్చారు.

The following two tabs change content below.

Check Also

మొక్కల చుట్టూ పాదులు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షణ చేయాలని జిల్లా ...

Comment on the article