Breaking News

ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా (ఫ్లాగ్‌ డే సందర్భంగా ) గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, ఐ.పీ.ఎస్‌. ఆదేశాల మేరకు 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి ఆన్‌లైన్‌ ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమాన్ని దాదాపు 735 మంది సద్వినియోగం చేసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కార్యక్రమంలో పోలీస్‌ స్టేషన్‌ పనితీరు, రికార్డుల వాడటం, సిబ్బంది విధుల నిర్వహణ, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న నూతన పద్ధతులు, టెక్నాలజీ వాడకం, రిసెప్షనిస్ట్‌ విధులు, ఆయుధాల వాడకం, కోర్టు సిబ్బంది విధులు, ఎఫ్‌.ఎస్‌.ఎల్‌, ఎం.సీ డ్యూటీలు, బ్లూ కోల్డ్‌, పెట్రోకార్‌, టెక్‌ టీం ఏ విధంగా విధులు నిర్వహించడం జరుగుతుందో క్షుణ్ణంగా వివరించారు.

The following two tabs change content below.

Check Also

ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్‌ ...

Comment on the article