Breaking News

Daily Archives: October 23, 2020

కరోనా పరీక్షలు పెంచాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శుక్రవారం వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు లేకుండా చేసినవారికి ప్రశంస పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలలో ప్రసవాలు జరిగే విధంగా చూడాలని కోరారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని, ప్రథమ, ద్వితీయ కాంటాక్ట్‌ వ్యక్తులకు కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. సమావేశంలో ...

Read More »

రహదారి పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి నెం.161 పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పిట్లం, బిచుకుంద మండలాలకు చెందిన 12 గ్రామాలకు ఇబ్బంది లేకుండా రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హైవే రోడ్డు ఎత్తుగా ఉండటం వల్ల పక్కన ఉన్న 12 గ్రామాల ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లడానికి ...

Read More »

పార్టీలకతీతంగా పనిచేస్తాం…

కామరెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్‌ గ్రామ అభివధి కమిటీని గ్రామ ప్రజల సమక్షంలో శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దూలం నారాయణ, కార్యదర్శిగా తెడ్డు సాయిలు, సహాయ కార్యదర్శిగా ఒడ్డెం రమేష్‌, కోశాధికారిగా కొత్తపల్లి నర్సింలు, ఉపాధ్యక్షులుగా పెద్దపోతనగారి స్వామీ, గడ్డమీది నరేష్‌, ఏడ్ల బాల్‌ సాయిలు, సుంకరి అశోక్‌లతో పాటు 30 మందిని కార్యవర్గ సభ్యులుగా మరియు సలహాదారులుగా ఎన్నుకున్నారు. వీరందరూ గ్రామ అభివద్ధికి పార్టీలకతీతంగా పని చేస్తామని అన్నారు. ...

Read More »

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సంస్కతి, సాంప్రదాయలకు ప్రతీకగా నిలిచే చివరి రోజైన సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కోరారు. సద్దుల బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే పూలను పూజించి, ప్రకతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కతి మన తెలంగాణలో ఉందన్నారు. ...

Read More »

రైతులను ఇబ్బందికి గురిచేస్తే చట్టపరమైన చర్యలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం వేల్పూరు మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు హౌసింగ్‌ శాఖా మంత్రి వేల్పూర్‌ లోని తమ నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాన కాలం ధాన్యం సేకరణలో బాగంగా 9 లక్షల టన్నుల ఉత్పత్తి సాదించడం జరిగిందని, అందులో 7 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని 445 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి జిల్లాలోని 247 రైస్‌ మిల్లర్లకు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. భారత ఆహార సంస్థ ...

Read More »

ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఎంఎస్‌సి ఫారం పరిసర ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి 6 ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్నట్టు టాస్క్‌ఫోర్సు సిఐ వెల్లడించారు. వాటిని సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారికి అప్పగించడం జరిగిందన్నారు. టిప్పర్ల నెంబర్లు : ఏపి 25 డబ్ల్యు 4174 ...

Read More »

ముగ్గురిపై పిడి యాక్టు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 5 వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోలో గల రౌడీషీటర్లు ఆరిఫ్‌, ఉస్మాన్‌, ఇబ్రహీం చోచ్‌ అనే ముగ్గురిపై నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశానుసారం పిడి యాక్ట్‌ చేసినట్టు నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సిఐ శ్రీనాథ్‌ రెడ్డి వెల్లడించారు. సదరు ముగ్గురు వ్యక్తులు గత సంవత్సర కాలం నుండి నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 5 వ టౌన్‌, ఒకటవ టౌన్‌ మరియు ఆరవ టౌన్‌ పరిధిలో వివిధ కేసులలో రిమాండ్‌ ...

Read More »