Breaking News

కరోనా పరీక్షలు పెంచాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శుక్రవారం వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు లేకుండా చేసినవారికి ప్రశంస పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలలో ప్రసవాలు జరిగే విధంగా చూడాలని కోరారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని, ప్రథమ, ద్వితీయ కాంటాక్ట్‌ వ్యక్తులకు కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌, జిల్లా ఐసిడిఎస్‌ అధికారిని అనురాధ, అధికారులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

జ్యోతి బా ఫూలే స్ఫూర్తిగా ముందుకు సాగాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ ప్రజా ...

Comment on the article