Breaking News

రైతులను ఇబ్బందికి గురిచేస్తే చట్టపరమైన చర్యలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం వేల్పూరు మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు హౌసింగ్‌ శాఖా మంత్రి వేల్పూర్‌ లోని తమ నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాన కాలం ధాన్యం సేకరణలో బాగంగా 9 లక్షల టన్నుల ఉత్పత్తి సాదించడం జరిగిందని, అందులో 7 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని 445 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి జిల్లాలోని 247 రైస్‌ మిల్లర్లకు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు.

భారత ఆహార సంస్థ వారి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తేమ 17 శాతం లోపు, తాలు ఒక్క శాతం ఉండాలని, అట్టి ధాన్యం సన్న రకాన్ని ఏ గ్రేడ్‌ గా పరిగణించి క్వింటాలుకు రూపాయలు 1 వేయి 888 మరియు సాధారణ రకానికి 1 వేయి 868 రూపాయలు రైతులకు ప్రభుత్వం ద్వారా కాంటా అయిన 3 రోజుల లోపు వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.

జిల్లాలోని రైతు సోదరులందరు పైన పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రైసు మిల్లర్ల తరుగు తీసుకొనే అవకాశం ఇవ్వకూడదని మంత్రి తెలిపారు. రైస్‌ మిల్లర్ల యజమాన్యము తరుగు, కడ్త పేరట రైతులను ఇబ్బందులకు గురి చేస్తే అటువంటి రైస్‌ మిల్లర్లను సీజ్‌ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం కరోనా నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు.

శుక్రవారం వేల్పూర్‌ మండలం కోమనపల్లి గ్రామంలో, భీంగల్‌ మండలంలో నంది గల్లీ, మరియు మెప్మా కొనుగోలు కేంద్రాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. 7 లక్షల టన్నుల దాన్యాన్ని సేకరించటానికి ఒక్క కోటి 75 లక్షల గొనె సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యం ఆలస్యం కాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, జిల్లా అగ్రికల్చర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ గోవింద్‌, డిసిఓ సింహాచలం, సివిల్‌ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

12న మౌన దీక్ష

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ నుండి ప్రగతి భవన్‌ ముందు రైతు ఐక్యవేదిక ...

Comment on the article