ముగ్గురిపై పిడి యాక్టు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 5 వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోలో గల రౌడీషీటర్లు ఆరిఫ్‌, ఉస్మాన్‌, ఇబ్రహీం చోచ్‌ అనే ముగ్గురిపై నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశానుసారం పిడి యాక్ట్‌ చేసినట్టు నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సిఐ శ్రీనాథ్‌ రెడ్డి వెల్లడించారు.

సదరు ముగ్గురు వ్యక్తులు గత సంవత్సర కాలం నుండి నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 5 వ టౌన్‌, ఒకటవ టౌన్‌ మరియు ఆరవ టౌన్‌ పరిధిలో వివిధ కేసులలో రిమాండ్‌ కావడం జరిగిందని, గత నెల రోజుల క్రితం పై ముగ్గురిపై రౌడీ షీట్‌ కూడా ఓపెన్‌ చేయడం జరిగిందన్నారు.

వీరు గత కొంత కాలం నుండి వివిధ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో సివిల్‌ తగాదాలలో కల్పించుకుంటూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. పై ముగ్గురిపై సంవత్సర కాలంలో రెండు అటెంప్ట్‌ మర్డర్‌ కేసులు కూడా ఉన్నాయని, వీరి నేరచరిత్ర ఆధారంగా పిడి యాక్ట్‌ విధించడం జరిగిందన్నారు.

Check Also

అనాధ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిశు గహ, బాల సదన్‌ గహాల్లో గల అనాధ ...

Comment on the article