Breaking News

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సంస్కతి, సాంప్రదాయలకు ప్రతీకగా నిలిచే చివరి రోజైన సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కోరారు. సద్దుల బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే పూలను పూజించి, ప్రకతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కతి మన తెలంగాణలో ఉందన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో గోదావరి జలాల బతుకమ్మ పండుగ చేసుకుంటాం అన్న మాటను నిజం చేశామని ఈ ఏడూ కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్న గోదారమ్మ పరవళ్ళు తొక్కుతున్న నిండు కుండలా ఉన్న చెరువుల్లో నేడు బతుకమ్మ పండుగ జరుపుకుంటునందకు సంతోషంగా ఉందన్నారు.

బతుకమ్మ పండుగ వచ్చిందంటే చెరువుల్లో ట్యాంకర్లతో నీళ్లు నింపి బతుకమ్మలు వేసే పరిస్థితి ఉండేదని, కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కషితో కాళేశ్వరం జలకళతో నిండు కుండల్లా, మత్తల్లు దుంకుతున్న చెరువుల్లో బతుకమ్మ వేసుకునే రోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేసారు. తెరాస ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పండుగను ప్రజలందరు వేడుకగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకున్నారు.

The following two tabs change content below.

Check Also

ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్‌ ...

Comment on the article