Breaking News

అంబులెన్స్‌లో ప్రసవం

కామారెడ్డి, అక్టోబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం, గుండారం, ఎల్లాపుర్‌ తండా గ్రామానికి చెందిన మాలోత్‌ సుప్రియ 24 సంవత్సరాలు. ఆమెకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని తక్షణమే సుప్రియని హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కాగా పురిటి నొప్పులు అధికం అవడంతో మార్గ మధ్యలో అర్గొండ గ్రామం వద్ద అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు.

మూడవ ప్రసవం కావడంతో పండంటి అడబిడ్డ జన్మించింది. తల్లి – బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య సేవల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, కామారెడ్డిలో చేర్పించారు. 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి- సత్యం, పైలట్‌- రామశంకర్‌లను సుప్రియ భర్త రాజేష్‌, కుటుంబ సభ్యులు కతజ్ఞతలు తెలిపారు.

The following two tabs change content below.

Check Also

పదవీ విరమణ

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి కార్యాలయములో పబ్లిసిటీ ...

Comment on the article