Breaking News

ఇదే బతుకమ్మ ప్రత్యేకత…

కామారెడ్డి, అక్టోబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రకతిలో లభించే పూలను సేకరించి బతుకమ్మ పేర్చి అమ్మవారిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. లింగంపేట మండలం ఐలాపురంలో మినీ ట్యాంక్‌ బండ్‌పై బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. దాతల సహకారంతో గ్రామాన్ని అభివద్ధి పథ లో నడిపించడం అభినందనీయమని కొనియాడారు.

గ్రామాభివద్ధిలో యువకులు కీలక పాత్ర పోషించారన్నారు. గ్రామాభివద్ధికి రెండు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆడపడుచులకు, ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. బతుకమ్మలను పెద్దగా పేర్చిన మహిళలకు బహుమతులు ప్రదానం చేసి, దాతలకు సన్మానం చేశారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ ధనలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు దేవేందర్‌, ఎంపీపీ గరీబు ఉనీషా బేగం, జెడ్పిటిసి సభ్యురాలు శ్రీలత, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు సంపత్‌ గౌడ్‌, ఎంపీడీవో మల్లికార్జున్‌ రెడ్డి, తహసిల్దార్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

జ్యోతి బా ఫూలే స్ఫూర్తిగా ముందుకు సాగాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ ప్రజా ...

Comment on the article