Breaking News

విజయదశమి నిర్ణయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ సంవత్సరము నిజ ఆశ్వీజ శుక్ల నవమి ఆదివారం అక్టోబర్‌ 25 వ తేదీ రోజున ఉదయం 7 గంటల 41 నిమిషాల వరకు నవమి తదుపరి దశమి, నిజ ఆశ్వీయుజ శుధ్ధ దశమి సోమవారము అక్టోబర్‌ 26వ తేదీ రోజున దశిమి ఉదయం 9 గంటల వరకు. కాలనిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మసింధు, ధర్మప్రవత్తి, కాలనిర్ణయ చంద్రిక, వ్రత రత్నాకరాది ధర్మ గ్రంధాలలో ఇలా చెప్పబడింది…

శ్లో. నవమీకలయాచైవ విధ్ధత్యాజ్యాభవేత్సదా!

పరవేధాయుతాయాంతు దశమ్యాముత్సవంచరేత్‌!!

శ్లో. శ్రవణర్షయుతాంచాపి పూర్వవిధ్ధాంపరిత్యజేత్‌!

అపరాజితార్చనే భూయాచ్చ్రవణ2ర్షాధిక్యతాభువిః!

తదైవశుభత్సాయా స్సాయంకాలస్థితాతిధిః!!

శ్లో. యదావ ధ్ధౌతిధీవాంతు దశమీద్వయసంభవం!

తదాతుప్రథమంత్యక్త్వా ద్వితీయేహ్యూెత్సవంచరేత్‌!!

శ్లో.సాయాహ్నవ్యాపినీయాస్యాద్‌ దశమీవిజయాబిధా!

నవమీశేషయుక్తాపి సాగ్రాహ్యావైష?వోత్తమైః!

ఈషత్సంధ్యామతిక్రాంన్తః కించిదుదిÄన్నేతారకః!

విజయోనామకాలో2యం సర్వకర్మర్థసిధ్ధిదః!

తస్మాత్‌ సాయాహ్నాసంయుక్త దశమీక్షేమదానణాం!!

పై ప్రమాణములనుసరించి శ్రవణానక్షత్రం ఉదయంకాల స్పర్శకలిగిన దశమి విజయముహూర్తము కనుక సాయంకాల వ్యాప్తంగా ఉండి అపరాహ్ణ వ్యాప్తి పొంది ఉన్నందున సోమవారం అక్టోబర్‌ 26వ తేదీ దశమికి శ్రవణా యోగము లేనందున, పూర్వదినమగు ఆదివారము అక్టోబర్‌ 25వ తేదీ రోజునే విజయదశమి శమీదర్శనం (పూజ) దసరాపండుగ చేయుటం అందరికీ శ్రేయస్కరం.

అందువలననే ఆదివారం దసరా పండుగగా నిర్ణయం చేయడమైనదని పండితులందరి అభిప్రాయం వ్యక్తం చేయటమైనది. 26వ తేదీ సోమవారం రాజులకు పట్టాభిషేకం చేయవలేనని ధర్మశాస్త్రం తెలుపుతున్నది.

The following two tabs change content below.

Check Also

ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్‌ ...

Comment on the article