Breaking News

పాము కాటేసింది.. పోలీసులు కాపాడారు…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామానికి చెందిన మహిళకు పాము కాటు వేసింది. పోలీసుల సహకారంతో సరైన సమయంలో చికిత్స పొందగలిగింది. వివరాల్లోకి వెళితే… గుత్తా మీద ద్రుపతి (36) తన గ్రామంలో ఆదివారం రాత్రి 11:50 గంటలకు పాము కరిచింది. ఆమెని బైక్‌ మీద ఆసుపత్రికి తరలిస్తుండగా కొంత దూరం ప్రయాణించిన తరువాత బైక్‌ ఆగిపోయింది.

అక్బర్‌ నగర్‌ గ్రామంలో రాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్న రుద్రూర్‌ పోలీసు బృందం రఘు, తిరుపతి అర్థరాత్రి 12:05 గంటలకు ఆమెను దారిలో గమనించారు. అత్యవసర పరిస్థితుల కారణంగా పెట్రోలింగ్‌ వాహనంలో తీసుకెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రి బోదన్‌ దగ్గరకు మార్చినట్టు రుద్రూర్‌ సిఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

అర్ధరాత్రి 12.15 గంటలకు సరైన సమయంలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ద్రుపతి ప్రాణాలకు ఎలాంటి నష్టం లేదని, సరైన సమయంలో ఆసుపత్రిలో చేర్చడం వలన ఆమె సురక్షితంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రమాదం నుండి బయట పడినందుకు చుట్టుప్రక్కల ప్రజలు పోలీస్‌ వారి సేవలను అభినందించారు.

The following two tabs change content below.

Check Also

ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్‌ ...

Comment on the article