Breaking News

పనుల పురోగతిపై కలెక్టర్‌ సమీక్ష

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకతి వనాలు, ధరణి, రైతు వేదికలు, నర్సరీ, మక్క పంటపై సంబందిత అధికారులతో వాటి పురోగతి ఎలా వున్నవని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అడిగి తెలుసుకున్నారు. మంగళవారం పల్లె ప్రకతి వనాలు, వైకుంఠ ధామాలు, హరితహారంపై ఎంపీడీవోలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఇప్పటి వరకు శాంక్షన్‌ అయిన ప్రకతి వనాలకు సంబంధించిన వర్క్‌ ఎలా వున్నవి పనులను అడిగి తెలుసుకున్నారు.

ఒక వేళా పనులు కానివి ఉంటే వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. అందులో ప్రతి జిపిల్లో పనులు జరుగుతున్నవని, పల్లె ప్రకతి వనంలో ఎకరాకు 4 వేల మొక్కలు, అర ఎకరా అయితే రెండు వేల మొక్కలు, ముప్పావు ఎకరం అయితే మూడు వేల మొక్కలు ప్లాంటేషన్‌ చేయాలని, ప్రకతి వనం పార్కులా ఉండాలన్నారు. పశువులు రాకుండా ప్రొటెక్షన్‌ కొరకు గేటు, ఐరన్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని, వర్షం వచ్చినా బురద కాకుండా గ్రావెల్‌ వేయించాలన్నారు. ప్రతి హ్యాబిటేషన్‌లో పల్లె ప్రకతి వనం ఉండాలన్నారు.

గ్రామ పంచాయతీలలో ప్రకతి వనం పార్కు ఏర్పాటు అంటే గొప్ప విషయం అన్నారు. గ్రామస్తులందరూ పార్కులో కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేసుకోవాలని, ప్లాంటేషన్‌ లేట్‌ చేయవద్దని, ఇప్పటి వరకు అన్ని మండలాలలో కలిపి 13 లక్షల 2 వేల మొక్కలు నాటలి కానీ అది ఇప్పటి వరకు కొన్ని కాలేదన్నారు. అన్ని చెల్లింపులు ఆన్‌లైన్‌లో జరగాలని, వైకుంఠ ధామాలు త్వరగా పూర్తి చేయాలన్నారు.

మొత్తం వైకుంఠధామాలు మంజూరు కాగా, కొన్ని మాత్రమే పూర్తి అయినాయని, ప్రారంభం కానివి కలిపి అన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. 5 మీటర్‌లకు ఒక్క మొక్క పెట్టాలని, పనులు జరుగని దగ్గర చర్యలు తప్పవని, గ్రామ పంచాయతీలలో అవసరమున్న మొక్కలను పెంచాలన్నారు. రైతు వేదికలు పూర్తి చేయాలని, రైతు వేదికలు పూర్తయిన దగ్గర ప్రారంభోత్సవం నాటికి అన్ని పూర్తయి ఉండాలని, పూర్తి కాని చోట తొందరగానే పూర్తి చేయాలని అధికారులను కోరారు.

రైతు వేదిక దగ్గర ఒక వన సేవకుడిని క్రిమటోరియం వద్ద ఒకరిని పెట్టాలని, విలేజ్‌ పార్క్‌ పూర్తయితే అక్కడ ఒకరిని పెట్టాలని, ఎక్కడ తేడా వచ్చినా వారిపై యాక్షన్‌ తీసుకోవాలని, ముఖ్యంగా మొక్కలు ఉండి తీరాలని సూచించారు. కొన్ని క్రిమిటోరియం లకు పేమెంట్‌ కావడం లేదని వెంటనే పేమెంట్‌ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో మక్క పంట ఎంత పండించారు వాటి వివరాలు సేకరించాలని ఆదేశించారు.

ఎక్కడ కూడా ఒక్క క్వింటాలు కూడా తేడా రావద్దని చెప్పారు. ప్రతి ఒక్కరు రెండు రోజులు సమయం తీసుకొని ఏమి తేడా రాకుండా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. నర్సరీలు వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్సులో అడిషనల్‌ కలెక్టర్లు లత, చంద్రశేఖర్‌, జెడ్‌పి సీఈఓ గోవింద్‌, పీడీ డిఆర్‌ డిఏ శ్రీనివాస్‌, ఈఈ పిఆర్‌ పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్‌ ...

Comment on the article